ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒలింపిక్ పార్కుల జర్గిన బహిరంగ సభల ప్రధాని మోడీ శానా సేపు మాట్లాడిండు.మోడీ ఏమేం మాట్లాడిండో సూద్దాం
ముందుగాల స్టేజ్ మీదకు రాంగనే అందర్కీ వంగి దండాలు పెట్టిండు మోడీ.
ఇగ మాటలు షురూ చేస్తు గీ గౌరవాన్ని భారత దేశానికి అంకితమిస్తున్న,మీరిచ్చిన ఘనస్వాగతం మర్వలేనిది.
ఒక భారత ప్రధాని ఇక్కడికి రానీకి 28 ఏండ్లు పట్టింది.
నేను భారత ప్రధానిగా ఉన్నందుకు మస్తు గొప్పగనిపిత్తంది.గంతకంటే ముందుగాల గిది నా భాద్యత అన్కుంటున్న.
సిడ్నీ అందమైన నగరం,ఆస్ట్రేలియా అందమైన దేశం.గీ దేశంతో మనకు క్రికెట్ బంధం గట్టిది.
యువ భారత్కు 250 కోట్ల చేతులున్నయ్,గల్ల 200 కోట్ల చేతులు 35 ఏండ్ల లోపున్నోల్లయే.
1964 టోక్యో ఒలింపిక్ల భారత్కు చెందిన ఒక వ్యక్తి ఆస్ట్రేలియా తరుపున ఆడిండు,గిదేం ఆశామాషీ ముచ్చట కాదు.
ఇండియాల కడు బీదలు కూడా భారత అభివృద్దిల భాగం కావాలని కోరుకుంటున్న
రిజర్వు బ్యాంక్ తోని మాట్లాడ్తే ‘జన్ ధన్’ పథకం అమలు చేయనీకి మూడేండ్లు సమయం పడ్తది అని చెప్పిర్రు,కాని నేను 150 రోజుల్లనే పూర్తి కావలె అని చెప్పిన.
గీ పది వారాలల్ల 71 మిలియన్ల బ్యాంక్ ఖాతాలు కొత్తగ తెర్శిర్రు.
మనం సవాలు గన్క తీస్కుంటే భారత్ మీద ఉన్న ఏమైనా చెడు భావనలు ఉంటె పోతై,
2019 ల గాంధీజీ 150వ వార్షికోత్సవం,గాంధీజీ మనకు స్వాతంత్ర్యం ఇచ్చిండు.మనం గాంధీ గార్కి స్వచ్చమైన భారత్ను ఇద్దాం.
ఎవరైనా భారత దేశంల పెట్టుబడులు పెట్టనీకి వత్తే,వారు బాగుండే జీవితాన్ని అల్ల పన్చేసేటోల్లకు ఇయ్యాలె.
ఐదేండ్ల,పదేండ్ల ఎంతన్నకాని నైపుణ్యం ఉన్న యువతను మన తయారు చేస్కోవాలే.
మీరు కావలన్కుంటున్న భారత్ను మనం తయారు చేస్కోవడమే మన పని.
ఇండియాకు మంచి పాలన మరియు నైపుణ్యం ఉన్న ప్రజలు కావలె,మీ కలే నా కళ.
ఇయ్యాల పనిదినం,అందర్కి కొలువులున్నై, ఐనా గిన్తమంది వచ్చిరంటే నమ్మలేకున్నం కదా.
గీ దినాన్ని ఎప్పట్కి యాద్ మర్వను, భారత్ మాతా కీ జై!

Post a Comment