తెలంగాణా అసెంబ్లీల సోమారం అంతా లడాయి మస్తుగనే జర్గింది.ఈ దినమంత సభ సమయం వేస్ట్ అయింది.ముఖ్యంగా కాంగ్రేస్ ఎమ్మెల్ల్యేలు చేసిన లొల్లి అంతింత కాదు.అధికార పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్తందని సభల దీన్మీద చర్చించాలే అని గట్టిగనే పట్టు పట్టింది కాంగ్రేస్.సభను నడ్వనిచ్చేది లేదని సభల లడాయి ఆపలేదు.దీన్తోని ముందుగాల 10 నిమ్షాలు,మల్ల 30 నిమ్షాలు,ఆఖరకు మంగళారానికి వాయిదేసిండు స్పీకర్.
పొద్దుగాల సభ షురూ అయినప్పట్నుంచి నల్ల బ్యాడ్జ్ లతోని సభకొచ్చిన కాంగ్రేసోల్లు గిట్లనే లొల్లి శేస్తంటే మంత్రి హరీష్ రావు ముందుగాల కాంగ్రేసోల్ల మీదకు ఫైరైండు.గీ సంస్కృతి మీదే అని,గిట్ల లొల్లి చేయకుండ సభ జర్పుకుందాం అని అన్నడు.మరో మంత్రి కేటీఆర్ మాట్లడ్తు వంద ఎల్కలను తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లిందట అన్నట్టుంది గీ కాంగ్రేసోల్ల లెక్క అని సభల అన్నడు.

Post a Comment