ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నంల ‘హరిత విశాఖ’ కార్యక్రమాన్ని షురూ చేసిండు.ఎంవీవీ కాలనీల జర్గిన వనమహోత్సవ్ కార్యక్రమంల పాల్గొని మొక్కలు నాటిండు.74 ప్రాంతాలలో 77 వేల మొక్కలు నాటే కార్యక్రమం ఇయ్యాల విశాఖల మొదలైంది.
గంతకంటే ముందు పొద్దుగాల ఎయిర్ పోర్టుకు శేరుకున్న సీఎం చంద్రబాబునాయుడుకు ఘనంగా స్వాగతం లభించింది.
ఈరోజంతా చంద్రబాబు విశాఖల శానా కార్యక్రమాల్లో పాల్గొంటడు.ఎంవీవీ కాలనీల కార్యక్రమం తర్వాతికి,జూ పార్కు ల జర్గే కార్యక్రమానికి,ఆనించి కైలాస్ గిరిల జర్గే వన భోజనాలకు హాజరైతడు.గక్కనుంచి కలెక్టరేట్ల తూఫాన్ మీద జర్గే సమీక్ష సమావేశాన్కి హాజరైతడు.పొద్దుమీకి ఆర్కే బీచ్ల సినీ తారల సందడికి వెళ్లి గానుంచి వుడా పార్కుల తూఫాన్ భాధితులకు సహాయం అందించినోల్లకు,సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బందికి అభినందనలు తెల్పే కార్యక్రమంల పాల్గొంటడు సీఎం చంద్రబాబునాయుడు.
Post a Comment