0
అసెంబ్లీ షురు ఐన కొంచం సేపట్లనే రెండు పార్ల వాయిదా పడ్డది.మొదగాల 10 నిమ్షాలు వాయిదా పడ్తే,రెండోపారి 30 నిమ్షాలు వాయిదా పడ్డది.
పార్టీ ఫిరాయింపుల పైన సభల చర్చిచాలే అని కాంగ్రేస్ పట్టు పట్టడంతోని సభల గడ్ బడ్ రేగింది.గిట్ల సభల లొల్లి సేయడం మంచిది కాదు,ఏమన్నుంటే ప్రశ్నోత్తరాలు అయ్నంక మాట్లాడుకుందాం అని స్పీకర్ ఎన్ని పార్లు చెప్పిన కాంగ్రేస్ గడ్ బడ్ ఆపలేదు.దీంతో సభను 30 నిమ్షాలు వాయిదా ఏస్తున్నట్టు స్పీకర్ చెప్పిండు.
సభ వాయిదాకు ముందు,గీ లోల్లిల మధ్యనే మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు టీడీపీని చీల్చింది ఎవరు,వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మా ఎమ్మెల్ల్యేలను రోజుకొక్కర్ని మీ పార్టీల చేర్చుకోలేదా,మొన్నటికి మొన్న ఎంపీ విజయశాంతి,ఎమ్మెల్ల్యే అరవింద్ రెడ్డి లను చేర్చుకుంది మీరు కాదా అని కాంగ్రేస్ మీద కోపానికోచ్చిండు.మీకో న్యాయం,మాకో న్యాయమా అని అన్నడు హరీష్రావు.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top