0
ప్రధాని మోడీ అన్టేందో మల్లోపారి కేంద్ర పట్టణాభివృద్ధి,పార్లమెంట్ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పిండు.
హైదరాబాద్ల జర్గిన ఒక కార్యక్రమంల మంత్రి వెంకయ్యనాయుడు ముచ్చట పెడ్తు ప్రధానమంత్రి పండుకోడు మమ్ముల(మంత్రులు) పండుకోనియ్యాడు అని చెప్పిండు.మాకు కూడా మస్తు కుషి అనిపిస్తది,ఎందుకంటే ప్రజలకు సేవా చేయనీకి ఉన్నం,సాధారణ ప్రజలకు మంచి జీవితాలను ఇయ్యనీకి మా ప్రభుత్వం ఉందంటే అందుకు మాకు సంబరమే కదా అని చెప్పిండు.
ఐదు సంవత్సరాల మ పాలనల ప్రతీ ఒక్కర్కి బ్యాంక్ ఖాతా ఉండాలన్నదే మా లక్ష్యం.జన్ ధన్ షురు కాకముందు దేశంలోని 58% మందికి బ్యాంక్ ఖాతా లేదు,గిప్పటికైతే 6.99 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలున్నయని చెప్పుకొచ్చిండు.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top