0
శాసనసభ షురు అయిందో లేదో అప్పుడే 10 నిమ్షాలు వాయిదా పడింది.కాంగ్రేస్ పార్టీ మేం ఇచ్చిన వాయిదా తీర్మానం మీద చర్చించాలే అని పట్టు పట్టిర్రు కాంగ్రేస్ ఎమ్మెల్ల్యేలు.ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులకు పాల్పడతండు అని కాంగ్రేస్ ఎమ్మెల్ల్యేలు నల్ల బ్యాడ్జ్ ల తోని సభకు వచ్చిర్రు.ప్రశ్నోత్తరాలు అయ్పోయినంక మాట్లాడుకుందాం అని స్పీకర్ ఎంత చెప్పిన ఇనలేదు.ఈల్లు ఇనేటట్టు లేరని సభను 10 నిమ్షాలు ఆయిడా ఏసిండు స్పీకర్.ఈరోజంత సభ జర్గనియ్యమని కాంగ్రేస్ అంటంది.
గీ లొల్లి మధ్య హరీష్ రావు మాట్లడ్తు,సభల చర్చించనీకి శానా ప్రశ్నలు ఉన్నాయ్,సభ సమయాన్ని వేస్ట్ చెయోద్దన్నరు.ఐటీ మంత్రి కేటిఆర్ మాట్లడ్తు మీరు అధికారమ్ల ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలను మీ పార్టీలకు గుంజుకున్నప్పుడు మేం కూడా గిట్లనే సభల అడిగితే ఏం జేసిర్రు అని అన్నడు.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top