ఉప్పల్ ల ఆదివారం జర్గిన మూడో వన్డేల భారత్ జట్టు శ్రీలంకను 6 వికెట్ల తోని ఓడిచ్చి సీరిస్ గెల్సుకుంది.గిప్పడ్దాంక జర్గిన మూడిట్ల మూడు మ్యాచ్ లు మనోల్లె గెల్సి 3-౦ తో ముందుర్రు.ఫస్టు రెండిట్ల ఎట్లైతే అల్కగ గెల్సిర్రో మనోళ్ళు,గీ మూడో మ్యాచ్ ల కూడా అల్కగనే గెల్సిర్రు.
గీ మూడో మ్యాచ్ ల కూడా శ్రీలంక కెప్టెన్ టాస్ గెల్సి బ్యాటింగ్ తీసుకుండు ఫస్టు.మన బౌలర్ ఉమేష్ యాదవ్ మొదగాల్నే 2 వికెట్లు తీస్కోని గట్టి దెబ్బ కొట్టిండు శ్రీలంకోళ్ళను.7 రన్నులకే 2 వికెట్లు పోయి కష్టంల శ్రీలంక ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వొచ్చిన జయవర్ధనే,దిల్షాన్(53) తో కల్సి 105 రన్నులు జత చేసిండు.గా ఎన్కపాలి వోచినోల్లను పెవిలియన్ల ఎవరో పిల్సినట్టే రాంగనే ఔటై పోయిర్రు.158 రన్నులకే 7 వికెట్లు పోయి 200 కూడా సేత్తదో సేయ్యదో అనుకున్నా ఒక దిక్కు జయవర్ధనే ఆడుతుండు కాబట్టి 200 దాటిత్తడు లే అనుకున్నరు.అనుకున్నట్టే ప్రసన్న(29) కల్సి తొమ్మిదో వికెట్కు 67 పరుగులు జత సేసిండు.గిట్లనే వన్దేలల్ల 12,000 రన్నులు కూడా చేసిండు,426 వన్డేలు ఆడిన 37 ఏండ్ల జయవర్థనే 17వ సెంచరీ కూడా చేసిండు.శివరికి తొమ్మిదో వికెట్ రూపంల 118 రన్నులు చేసి ఔటైండు.48.2 ఓవర్లల్ల 242 రన్నులు చేసి శ్రిలంకోళ్ళు అందరౌటైర్రు.
ఉమేష్ యాదవ్ కెరీర్ లనే మొదటిపాలి 4 వికెట్లు తీసుకుండు,గట్లనే అక్షర్ పటేల్ కూడా కెరీర్ ల బెస్టు బౌలింగ్(3-40) నమోదు సేసుకుండు.
ఇగ 243 పరుగులు కొట్టనీకి బ్యాటింగ్ కు వొచ్చిన మనోళ్ళు ధావన్,రహనేలు మంచిగనే ఇన్నింగ్స్ షురూ సేసిర్రు.ఫామ్ ల ఉన్న గీ ఇద్దరు 12 ఓవర్లల్ల 62 రన్నులు సేసినంక రహనే 31 కొట్టి ఔటైండు.ఫామ్ లో ఉన్న ఇంకో ఆటగాడు తెలుగు పిలగాడు రాయుడు ధావన్ కు జతైండు.గీల్లిద్దరు మూడో వికెట్కు 71 కొట్టినంక రనౌట్ అయిండు.ఇటు పక్కున్న ధావన్ వత్తండో,వత్తలేడో సూసుకోకుండనే ఉరికి ధావన్ పక్క సేరిండు,ధావన్ ఐతే క్రీజ్ ల కేలి కదల్లేదు.అసలైతే ఉర్కాలంటే ఉర్కోచ్చు,వొట్టిగనే రన్ను వోచ్చేదే ఉరికితే,ఫీల్దరాయన కూడా బాల్ చేతులకేలి జారగోట్టిండు.గీలెక్కన సూత్తే రున్ను వోచ్చేదే.35 రన్నులు కొట్టి రాయుడు పెవీలియన్ పోయిండు.
కెప్టెన్ కోహ్లి రానే వచ్చిండు క్రీజ్ లకు గక్కడ గాలేరీల ప్రేమించిన పిల్ల అనుష్క శర్మ దిక్కు సూసుకుంట.ధావన్,కోహ్లి లు బౌలర్లకు వికెట్ తీసుకునే చాన్సు ఐతే ఇయ్యలేదు గెల్తమనే నమ్మకం కల్గేదాక.50 రన్నులు దాటినంక ధావన్ శ్రీలంక బౌలర్లను ఉతుకుడు షురు సేసిండు.90 ల కోచ్చిండు ఇగ తొమ్మిదైతే నూరు కొడ్తడు అనుకుంటంటే అంపైర్ సెయ్యి లేపిండు ఔటైనవని.ఎట్లౌటైన్డో అని రిప్లై ల చూస్తే హెల్మెట్ తాకి కీపర్ సెయ్యిల బాల్ పడినట్టు నజర్ల పడ్డది.
శిన్నగ కోహ్లి కూడా అర్థ సెంచరీ అయిపోగొట్టుకుండు.అర్థ సెంచరీ అవ్వంగనే అనుష్కకు గాల్ల ముద్దు కూడా ఇచ్చిండు.ఇంకేడు కొడ్తే గెల్తం అనంగా బౌండరీ తాడు కాడ క్యాచ్ ఇచ్చి 53 తాన ఔటైండు కోహ్లి.
సురేష్ రైనా 18,సాహ 6 రన్నులతో ఔట్ కాకుండ ఉన్నరు లాస్టుకు.ఇంకా 5.5 ఓవర్లు మిగిలే ఉన్నయి.గీలెక్కన సూసుకుంటే ఇంకా 300 అయినా మనోల్లు కొట్టేటోల్లు.
సెంచరీ సేసినా జట్టును గెల్పించలేకపోయిన జయవర్ధనే కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చిర్రు.
నాల్గో వన్డే నవంబర్ 13 న కోల్ కతా ఈడెన్ గార్డెన్ ల జర్గుతది.


Post a Comment