తెలంగాణా కేలి బీజేపీ పార్టీకున్న ఒకేఒక ఎంపీ బండారు దత్తాత్రేయ.మోడీ కాబినేట్ల ఆదివారం ఇంకొదర్ని చేర్పించుకుంటండు.గీ కాబినేట్ల ఎట్లైన మంత్రి పదవొత్తదని మస్తు ఆశగుండే దత్తన్న.శనివారం పొద్దుగాల్నే ప్రధానమంత్రే ఫోన్ చేసి రేపు ఢిల్లీకి రమ్మన్నడట.గిదివరకు రైల్వే సహాయ మంత్రిగ పనిచేసిండు దత్తాత్రేయ.
దత్తన్న ఎట్లైనా మంత్రి పదవి వొత్తదని రెండు దినాల ముందే తయారై కుసుండు,ఫోన్ ఎప్పుడోత్తే గప్పుడు ఇమానం ఎక్కుదామని.అనుకున్నట్టే ఫోన్ రాంగనే మస్తు దిల్ కుశైండు.శనివారం పొద్దు గూట్లే పడంగనే ఢిల్లీ కి పోతండు దత్తన్న

Post a Comment