తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు షురు అవ్ డే
ఆలస్యం,లొల్లి స్టార్ అయింది.విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను రద్దు
చేసిన స్పీకర్ సక్కగ ప్రశ్నోత్తరాలకు వెళ్దాం అన్డో లేదో
కాంగ్రేసోల్లు,టీడీపోళ్లు,బీజేపోల్లు స్పీకర్ ను సుట్టుముట్టే.రైతు సమస్యల
మీద మాట్లాడాలే,పోచారం శ్రీనివాస్ మంత్రి పదవికి రాజీనామా సెయ్యాలని మంకు
పట్టు పట్టే.గీల్లు ఇనకపోయేసరికి 10 నిమ్శాలు వాయిదేసిండు సభను స్పీకర్.10
నిమ్శాలకు సభ షురు అయినంక మల్ల గదే లొల్లి,ఇంకో పది నిమ్శాలు సభ వాయిదా
ఏసిండు స్పీకర్.
గీ మధ్యల సీఎం కెసిఆర్ ప్రభుత్వం అన్నీ చర్చిన్చనీకి తయారుగుంది,కావల్నంటే ఇంక పది రోజులు సభా సమావేశాలు సాగాదీసుకుందాం,గిప్పుడైతే గీ ప్రశ్నోత్తరాలు సాగనిచ్చుకుందాం అని రెండు మూడు సార్ల సభల చెప్పిండు.ఇగ సభ మూడోపారి షురు అయింది.మల్ల గదే కథ,స్పీకర్ కు ఏం సేయ్యాలో సమజ్ కాలే.గింతల్నే శాసనసభ యవారాల మంత్రి హరీష్ రావు లేవనే లేసిండు.గీ లొల్లి సేత్తున్న 10 మంది టీడీపీ ఎమ్మెల్ల్యే ల సభ నుండి ఒక్క రోజు సస్పెండ్ సేద్దామని పతి పాదించే,స్పీకర్ గీ పది మంది టీడీపోళ్ళను సభలకేలి సస్పెండ్ సేత్తున్నట్టు సెప్పిండు.సస్పెండ్ సేయ్యంగనే పోతారా?పోరు కదా !ఇగ మార్షల్స్ వొచ్చి గీళ్ళను సభ బయట ఇడిసిపెట్టిర్రు.
సభ ఈనించి సక్కగనే సాగింది.ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ కాంగ్రేసోల్లను డ్రామా సేత్తారనబట్టే,ఇంతల్నే లేసిన జానారెడ్డి మమ్మల్నే డ్రామా అంటవ,నువ్ సారి సెప్పు మాకు,మీరే డ్రామాలు సేత్తార్రాని గట్టిగనే అన్నడు.ఈటెల రాజేందర్ కూడా మాగురించి సెడ్డగ మాట్లాడిండు గాయన కూడా మాట్లాడినై ఎనక్కు తీసుకోవాలే అన్నడు జానారెడ్డి.మేం మీతో జత కట్టినం కాని,గా టీడీపోల్లతో ఎప్పుడు జతకడితిమి,గట్ల మాట్లాడుడు ఏమన్న మంచిగుంద అని జానారెడ్డి మంత్రి ఈటెలను అనంగనే సభల అందరు నవ్వుకుండ్రు కొద్సేపు.
గింతల్నే కొంచం శాయ బొట్టు తాగొద్దాం అని స్పీకర్ 15 నిమ్షాలు సభను వాయిదా వేసే.మల్లోచ్చినక సభల బడ్జెట్ మీద జానారెడ్డి చర్చను షురు చేసిండో లేదో టైం కతమైందని సోమారానికి సభను వాయిదా ఏసీ ఇంటికేల్లిర్రు శాసన సభ్యులు.
పెద్దల సభ శాసనమండలి ల కూడా మొదగాల కొంచంసేపు గడ బిడ ఐనా కొద్ది గొప్ప చర్చ ఐతే నడ్సింది.గీ సభను కూడా మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ సోమారానికి వాయిదేసిండు.

Post a Comment