చెస్ ప్రపంచ కప్పు ఇయ్యాల నుంచి సోచి(నార్వే)ల షురు అయ్తంది.ఐదు సార్ల
ప్రపంచ కప్పు గెల్సిన భారత్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ తోని కిందటేడాది
కప్పు గెల్సిన మాగ్నస్ కార్లసన్ పోటీ పడ్తండు.కార్లసన్ దిక్కే కొంచం మొగ్గు
కొడ్తంది కప్పు కొట్టనీకి.నిరుడు జర్గిన కప్పు కోసం కూడా గీల్లిద్దరే పోటీ
పడ్డరు.గప్పుడు కార్లసన్ ఐతే అల్కగనే ఆనంద్ ను ఓడించి కప్పు
గెల్సిండు.గీసారి అట్లాకాదని ఆనంద్ అంటున్నడు.
మొత్తం కల్పి 12 ఆటలు ఆడ్తరు.గీ పన్నెండు ఆటలల్ల ముందుగాల ఎవరు 6.5 పాయింట్లు అందుకుంటడొ గాయనే ప్రపంచ ఛాంపియన్.12 ఆటలు అయ్నంక ఇద్దర్కి సమంగా పాయింట్లు వత్తే నాలుగు టైబ్రేక్ ఆటలు ఆడిత్తరు,గిల్ల కూడా సరిసమానంగా ఉంటే మల్ల రెండు ఆటలు ఆడిత్తరు.గిట్ల కూడా ఫలితం రాలేదంటే సడన్ డెత్ తోని ఎవరు గెల్సిర్రో డిసైడ్ చేస్తరు.ఏ రౌండ్ల ఎవరు ఏ పావులతో ఆడ్తరోడ్రా తీస్తరు,అంటే నల్లు పావులు తెల్ల పావులు ఉంటై కదా.గల్ల ఎవరు ఏ పావులతో మొదగాల ఆడాల్నో డ్రా ల తెల్తది.

Post a Comment