0
అహ్మదాబాద్ మోతేరా ల బేస్తారం భారత్,శ్రీలంకల మధ్య  జర్గిన రెండో మ్యాచ్ ల భారత్ 6 వికెట్ల తోటి గెల్సి 2-0 తోని ముందున్నది.అంబటి రాయుడు ఇప్పటిదాంక వన్డేల్ల సెంచరీ సేయలేదు.గియ్యాల జర్గిన మ్యాచ్ ల గా ముచ్చట కూడా తీర్చుకుండు రాయుడు. శ్రీలంకతో జర్గిన రెండో మ్యాచ్ ల భారత్ గెల్సిందంటే రాయుడు కారణం.రాయుడు శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేసిండు అనుకోరాదుర్రి.రాయున్ని ఔట్ చెయ్యనీకి శ్రీలంక కెప్టెన్ 8 మందితో బౌలింగ్ చేయించినా కూడా ఔటైతే చెయ్యలేకపోయిర్రు.లాస్టు దాంక క్రీజ్ ల నిలబడ్డ రాయుడు 121 రన్నులు చేసి ఔటు కాకుండ ఉండి భారత్ కు గెలుపందించిండు.
గంతకంటే ముందుగాల బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఉరికురికి రన్నులైతే సేయలేదు.గప్పుడో ఫోరు గప్పుడో ఫోరు కొట్టుకుంట మెల్ల మెల్లగా స్కోరు బోర్డును ఉరికిద్దామనుకునే సరికి ఒకడు ఔటైతండు.నాల్గో వికెట్ కు సంగక్కర(61),కెప్టెన్ మాథ్యుస్(92*) లు 90 రన్నులు జతసేసిర్రు.సంగక్కర ఔటైనంక వచ్చినోల్లు కొద్దిసేపు క్రీజ్ ల ఉండుడు,ఔటౌడు. గిదే కథ 8 వికెట్లదాంక.తొమ్మిదో వికెట్ కు దమ్మిక ప్రసాదు(30),మాథ్యుస్ లిద్దరు కల్సి 54 రన్నులు కొట్టిర్రు.మొత్తం మీద ఓవర్లన్ని అయ్యేసరికి 274/8 చేసిర్రు.
275 పరుగులు కొట్టనీకి బ్యాటింగ్ కు వచ్చిర్రు మనోళ్ళు.275 అంటే అల్కగనే కొట్టొచ్చు.ఎందుకంటే గీ పిచ్ మీద 300 రన్నులు కొట్టడడం షానా ఈజీ.అల్కగనే కొట్టొచ్చు అనుకుర్రో మరేమనుకుర్రో ఓపెనర్లు ధావన్,రహనే.మస్తు మెల్లగా ఆడిర్రు మొదగాల ఓవర్లల్ల.ఫాస్ట్ ఆడ్డామ్ అనుకునే లోపే రహనే 8 కొట్టి ఔటైండు.ఫస్ట్ వికెట్ పోంగనే కోహ్లి రావాలె,కాని రాలే.కెప్టేనాయే,ఎన్కశీరి ఏమన్నైతే కెప్టెన్ గా జట్టును గెల్పియ్యాలే కదా అన్కుండేమో రాయున్ని పొమ్మన్నడు.రాయుడు వొచ్చినంక  స్కోరు బోర్డు కొంచం ఉరికింది.ధావన్(79) తోని కల్సి రాయుడు రెండో వికెట్ కు 122 పరుగులు జత సేసిండు.తర్వాతొచ్చిన కోహ్లి(49)తోని కల్సి 116 పరుగులు జత సేసిండు రాయుడు.ఇగ ఒక్క రన్నైతే 50 అయ్యేది.49 కాన్నే ఔటైండు కోహ్లి.వాల్లవ్టైతే నాకేంది అనుకున్న రాయుడు దంచుడు ఐతే ఆపలే.రైనా వొచ్చి 14 కొట్టి ఔటైండు.శివర్ల ఫోరు కొట్టి భారత్ ను గెల్పించిండు గీ తెలుగు పిలగాడు.
మ్యాన్ అఫ్ ద మ్యాచ్ రాయుడు గెల్సిండు.గీ సెంచరీ మా నాయ్నకు అంకితం ఇత్తాన అని సెప్పిండు రాయుడు.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top