0
మహారాష్ట్ర రాజకీయాలల్ల కొన్ని దినాల సంది జర్గుతున్న గడిబిడికి బుదారం తాళం పడ్డది.అసెంబ్లీల బలం సూపించుకొని విశ్వాస పరీక్ష గెల్సింది బీజేపీ పార్టీ.బీజేపీకి,శివ సేన కు మధ్య పొత్తు ఖరారు కాలే,శివ సేన ఇగ మేం ప్రతిపక్షంలనే కూసుంటాం అని చెప్పిర్రు.
విశ్వాస పరీక్ష గెల్తమో  లేదో అనుకున్న బీజేపీ కి,ఎన్సీపీ మద్దతు ఇయ్యడం తోని గెల్సి బయ్ట పడ్డది.
దీనికి ముందుగాల స్పీకర్ కు ఎన్నిక జర్గింది.బీజేపీ,శివ సేన,కాంగ్రేస్ ల మధ్య స్పీకర్ కు మస్తు పోటీ ఉంటదన్కున్నరు.కాని లాస్టుకు వొచ్చేసర్కి బీజేపీ ఒక్కలే పోటీల ఉన్నరు.బీజేపీ నుంచి నిలబడ్డ  హరి బాహు హెగ్డే స్పీకర్ ను గెల్సినట్టు ప్రోటెం స్పీకర్ ప్రకటించిండు.
మహారాష్ట్ర అసెంబ్లీల మొత్తం బీజేపోళ్ళు 122 మంది,శివ సేనోల్లు 63 మంది,కాంగ్రేసోల్లు 42,ఎన్సీపోల్లు 41,సొంతంగా గెల్సినోల్లు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నరు.
గీ బాల పరీక్షల దేవేంద్ర ఫడ్నవిస్ గెల్వంగనే మహారాష్ట్రల బీజేపీ శ్రేణులు మస్తు సంబరాలు సేసుకుర్రు.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top