29వ రాష్ట్రంగా ఏర్పడ్డంక తొలుసూరి బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి ఈటెల రాజేంద్ర ప్రవేశపెడుతుర్రు.ఇయ్యాల నుంచి 18 దినాలపాటు బడ్జెట్ సమావేశాలు నడుత్తాయి.మొదటి రోజు బుదవారం నాడు అసెంబ్లీ స్టార్టు అయ్తది.స్టార్ట్ కాంగనే ఈటెల బడ్జెట్ సదువుతడు,బడ్జెట్ సదవంగనే అసెంబ్లీ వాయిదా వెత్తరు.మండలిల ఉపముఖ్యమంత్రి రాజయ్య బడ్జెట్ ను ప్రవేశపెడ్తడు.గవర్నర్ సెషన్ లేకుండనే అసెంబ్లీ సెషన్ మొదలైతంది.
ఇగ ఫస్ట్ సారి తెలంగాణా బడ్జెట్ ఎట్లుంటదో అని పతీ ఒక్కరు సూత్తున్నరు.లక్ష కోట్ల బడ్జెట్ తో రాష్ట్ర బడ్జెట్ ఉంటదని అందరనుకుంటార్రు.గిది నాలుగు నెల్లకు సంబంధించిన బడ్జెటే ఐనా ప్రభుత్వం తతిమ్మా 4 ఏండ్లు వాల్లేమేం సేత్తారో దీంతోటి తెల్తంది.
ఈపాలి నుంచి తెలంగాణా అసెంబ్లీ రెండు పూటల ఉంటది,అందరు అన్ని ఇషయాలు మాట్లాడనీకి సమయం ఇయ్యాలె అనే గిట్ల రెండు పూట్ల అసెంబ్లీ పెడ్తానమని కెసిఆర్ చెప్పిండు.
రాజేంద్ర ఏమన్దంటే నాకు మస్తు కుశైతంది,ఎందుకంటే తెలంగాణాల ఫస్ట్ ఫస్ట్ బడ్జెట్ నేనే పెడ్తున్న కద అని.

Post a Comment