గాయాన బంగ్లాదేశ్ రైల్వే మంత్రి
67 ఏండ్ల ముసలోడు
- 29 ఏండ్ల పోరితో పెళ్ళి
మీరు సదివింది వొట్టిముచ్చటే అనుకునేరు.నిజమే బంగ్లాదేశ్ రైల్వే శాఖ మంత్రి ముజిబుల్ హక్,గీయనకు గటో గిటో 67 ఏండ్లున్టై.పోరిని ఎవడియలేదో,పెళ్ళి సేసుకుందాం అంటే ఇష్టం లేదో లేకుంటే మరేందో తెల్వదు గాని ఇంనేడ్ల సంది ఆయన పెళ్ళే కాలేదు.గిప్పుడన్న షాది సేసుకోవాలే అనుకున్నట్టుండు,29 ఏండ్ల పోరిని పెళ్ళి చేసుకోనీకి డిసైడ్ అయ్యిండు.పెళ్ళి పిల్ల పేరు హోనుఫా అఖ్తర్ రిక్త.గీ పిల్లకు 4 లచ్చల కట్నం సదివించుకున్దంట.గిదంత బంగ్లాదేశ్ ల ఉన్న కొమిల్ల జిల్లాల మీర్ఖోల అనే ఊళ్ళ జర్గింది.ఇగ ముసలి పెళ్లి కొడుకు తరుపున ఏం తక్కువ 700 మంది సుట్టాలు వచ్చిర్రట.గేట్లనున్చి పెళ్లి పీటల కాడికి పోవాలి కదా,మరి మరదళ్ళు ఊరుకుంటర,పైసలిత్తనే పోవాల్నాయే,ఒక లచ్చ ఒక తాకలు ఆల్లకు ఇత్తనే పెళ్లి పీటలు ఎక్కనిచ్చిర్రు.పిల్ల సూన్నీకి బాగుంది,మల్ల చిన్న పిల్ల….. గీ ముసలోన్ని ఎట్ల సేసుకుంది అని అందరు అనుకుంటుర్రట ఈ వార్త తెలిసినోల్లు.
Subscribe to:
Post Comments (Atom)

Post a Comment