చాపెల్ అనేటాయన పెద్ద రింగ్ మాస్టరు
తను అనుకున్నై ఏమైతే ఉంటయో అందరూ అయ్యే అనుకోవాలే
ద్రావిడ్ ను తీసేద్దామన్నడు,లక్ష్మణ్ ను వద్దన్నడు
తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’అనే పుస్తకంల రాసుకున్న సచిన్
బేస్తారం ఇడుదలౌతున్న ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకం ఇడుదలకు ముందుగనే ఒక ఊపు ఊప్తంది.భారత్ క్రికెట్ జట్టుకు చాపెల్ పాత కోచ్.గాయన కోచ్గా ఉన్నప్పుడు ఏమైందో తన పుస్తకంల సచిన్ చెప్పిండు.ఎం చెప్పిండో ఇంక ఏమేం రాసుకుండో గా పుస్తకంల సూద్దాం.
2007 ప్రపంచ కప్ కు కొన్రోజుల ముందు ఛాపెల్ మా ఇంటికొచ్చి ద్రావిడ్ ను కెప్టెన్ నుంచి తీసేద్దామా అన్నడు.ఛాపెల్ గట్లనంగనే నేను,అంజలి మస్తు షాక్ తిన్నం.ద్రావిడ్ ను తీసేద్దాం,ద్రావిడ్ జాగల నువ్వుకెప్టెన్ కావాలే,మనిద్దరం కల్సి భారత్ క్రికెట్ ను దున్నేద్దాం అని సెప్పిండు.ద్రావిడ్ అంటే ఛాపెల్ కు కొంచం కూడా దయ లేదు.ఆటగాళ్ళ పైన ఆయనకు అనిపించినై అన్ని పుయ్యాలని సూసిన పెద్ద ‘రింగ్ మాస్టరు’ ఆయన అని ఎవ్వరినీ గట్టిగ అనని సచిన్ మొదట్సారి ఛాపెల్ ను సంపి వదిలుండు.
ఒకసారంట లక్ష్మణ్ ను ఇన్నింగ్స్ ఓపెన్ సేయమన్నడట ఛాపెల్,నేను చెయ్యను అని మొఖం మీద చెప్పిండట లక్ష్మణ్.ఇగ అది మనసుల పెట్టుకున్న ఛాపెల్ ‘నువ్వు 32 ఏల్లున్నవ్ గీ ఏజ్ ల మల్ల టీమ్ లకు వచ్చి ఆడడం మస్తు కష్టం’ అని లక్ష్మణ్ ను అనంగనే మియమందరం షాకైనం.
2007 ప్రపంచ కప్పుకు ఛాపెల్ ను మాతోటి వెస్టిండీస్ కు పంపొద్దని బీసీసీఐ కి నేన్చేప్పిన,జట్టుకు సీనియర్లము సూసుకున్టం అని చెప్పిన కాని అట్లజర్గలె.ఒక బెర్ముడా మీద తప్పిస్తే బంగ్లాదేశ్,శ్రీలంక దేశాల మీద ఓడ్పోయి ఇంటికొచ్చినం.గాదనికంతటికి చాపలే కారణం.
2007 ప్రపంచ కప్పు అయినంక ఇగ క్రికెట్ ఆడొద్దనుకున్న.మా కుటుంబం,దోస్తుల వల్ల గా ప్రపంచ కప్పు యాదిలకేలి బయటపడ్డ.
గా పుస్తకంల ఇంకేమేం ఉన్నాయే తెల్వాల్నంటే బేస్తారం దాంక ఆగుదాం.

Post a Comment