కటక్ ల శ్రీలంక తోటి జర్గిన ఫస్ట్ మ్యాచ్ ల భారత్ దంచి కొట్టింది.భారత్ దెబ్బకు శ్రీలంక తుక్కు తుక్కులోడిపోయింది.169 రన్నులతోటి భారత్ గెల్సింది.టాస్ ఓడి మొదగాల బ్యాటింగ్ చేసిన భారత్ 363 రన్నుల్లు కొట్టింది.364 రన్నులు కొట్టనీకి బ్యాటింగ్ వచ్చిన శ్రీలంక ఆటగాళ్ళు ఎక్కడకూడా గెల్వాలే అన్నట్టు ఆడలేదు.ఎక్కినోడు ఎక్కినట్టే ఔటైర్రు.జయవర్ధనే ఒక్కడే కొంచంసేపు నిలబడి 43 రన్నులు కొట్టిండు.ఇషాంత్ శర్మ 4,అక్షర్ పటేల్,ఉమేష్ యాదవ్ లు రెండ్రెండు వికెట్లు తీసుకున్నరు.
అంతకంటే ముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ఆటగాళ్ళు రహనే 111,ధావన్ 113,రైనా 52 రన్నులు చేయడంతో 363 పరుగులు చేసింది తెల్సిందే.రహనే ను బాగాడినందుకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చిర్రు.దీంతో 5 మ్యాచ్ ల సీరీస్ ల 1-0 తో ముందుంది భారత్.ఇగ రెండో వన్డే నవంబర్ 6 వ తారీఖున అహ్మదాబాద్ ల జర్గుతది.
Post a Comment