భారత్,శ్రీలంక ల నడుమ కటక్,భారబతి స్టేడియంల నడ్తున్న వన్డే మ్యాచ్ ల భారత్ ఓపెనర్లు ఊత కొట్టుడుకొట్టిర్రు.ఇద్దరు పోటీ పడి కొట్టిర్రు,ఏ ఒక్క బౌలర్ను వదల్లే.బాలు బ్యాటుకు అందిందో గంతే సంగతి,ఫోర్ల మీద ఫోర్లు.శ్రీలంక బౌలర్లు ఆగమాగామయ్యిర్రు.గీల్లక్కు ఎట్లాంటి బాలేయ్యాలో సమజ్ కాక తల పట్టుకుర్రు.
మొదగాల టాస్ గెల్సిన శ్రీలంక,భారత్ ను బ్యాటింగ్ చెయ్యమంది.రహనే,దావన్లు ఓపెనర్లుగా వొచ్చి ఫస్ట్ 10 ఓవర్లు సిన్నగనే ఆడిర్రు,ఆనుంచి స్కోరు బోర్డును ఉరికిచ్చిర్రు.ఇద్దర్కల్సీ 35 ఓవర్లల్ల 231 పరుగులు కొట్టిర్రు.గప్పటికే 113(107 బంతుల్లో 14 ఫోర్లు,3 సిక్సులు) పరుగులు చేసిన ధావన్ ఔటైన్డు.కొంచమైనంక 37.5 ఓవర్ల కాడ రహనే కూడా(111,108 బంతుల్లో 13*4,2*6)ఔటైన్డు.తరువాత రైనా,కోహ్లి జతకట్టిర్రు.రైనా ఐతే శ్రీలంక బౌలర్లను సంపుడు స్టార్ట్ చేసిండు.గీల్లిదరు కల్సి 52 పరుగులు చేసిర్రు.రైనా చేసింది కూడా 52 పరుగులే.33 బంతుల్లో 4 ఫోర్లు,3 సిక్సులతో శ్రీలంక బౌలర్లను షెండు ఆదుకున్నాడు రైనా.తరువాత వొచ్చినోల్లు కూడా మంచిగనే ఆడిర్రు.50 ఓవర్లల్ల 5 వికెట్లు పోగొట్టుకొని 363 పరుగులు చేసింది భారత్.
గీ భారాబతి స్టేడియంల భారత్ చేసిన 363 పరుగులే ఇప్పటిదాంక ఎక్కువ పరుగులంట.

Post a Comment