భారత్ పర్యటనల ఉన్న శ్రీలంక ఐతారం శివరి మ్యాచ్ రాంచిల
ఆడ్తంది.ఇప్పటిదాంక జర్గిన 4 వన్డేలల్ల ఓడి సీరీస్ పోగొట్టుకున్న
శ్రీలంక,గీ మ్యాచ్ ల ఐన గెల్సి ఇజ్జత్ నిల్పుకోనీకి సూత్తంది.ఇగ బాగ ఊపు
మీద ఉన్న భారత్ శివరి మ్యాచ్ ల కూడా గెల్సి సీరీస్ కు సున్నం కొట్టనీకి
సూత్తంది.
రాంచిల జర్గే మ్యాచ్ ల కూడా భారత్కే గెల్సే అవకాశాలు ఉన్నయ్.శ్రీలంకను ఉత్తగనే ఓడిస్తం అని భారత్ ఆటగాళ్ళు అనుకుంటంటే శ్రీలంక ఆటగాళ్ళు మాత్రం మస్తు ఫికర్ పడుతుర్రు 5-0 ఓడిపోతే ఇజ్జత్ ఏంగాను అని.
గిప్పటిదాంక ఐతే శ్రీలంక ఏ దేశం మీద కూడా 5-0 ఓడలేదంట.ఒక్కపాలి మాత్రం 4-0 తో పాకిస్థాన్ మీద 1984 ల ఓడిందట.
ఇగ మ్యాచ్ ఇషయానికి వత్తే అందరి నజర్ మొన్న డబుల్ సెంచరీ చేసిన రోహిత్ మీదనే ఉన్నయ్.గీ మ్యాచ్ ల రైనాకు విశ్రాంతి ఇచ్చిర్రు,రైనా జాగల జాదవ్ ఆడే అవకాశం ఉంది.
ధోని సొంత ఇలాకల ఆడుతున్న మ్యాచ్ ల ధోని ఆడకోపోయేసర్కి అక్కడి ఫాన్స్ మ్యాచ్ సూన్నీకి ఇష్ట పడట్లేదట.టికెట్లు 40% కూడా అమ్ముడుకాలేదట.

Post a Comment