0
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా సిన్మా ‘లింగా’ ట్రైలర్ ఇడుదలైంది.కెఎస్ రవికుమార్ దర్శకత్వంల వత్తున్న ఈ చిత్రం డిసెంబర్ల ఇడుదల చేయడానికి సిన్మా యూనిట్ సూత్తంది.
ఈ ట్రైలర్ను సూసినోల్లు సిన్మా మీద మస్తు అంచనాలైతే పెట్టుకుంటరు,ఎందుకంటే ట్రైలర్ గట్లుంది మల్ల.తెల్ల దొరల కాలంనాటి దృశ్యాలు,నీళ్ళ ప్రాజెక్టు కట్టనీకి హీరో కొట్లాటలు,సోనాక్షి సిన్హా పాత కాలంనాటి పిల్లలా,అనుష్క రిపోర్టర్ గా గీ ట్రైలర్ల ఐతే కనిపిచ్చిర్రు.
‘లింగా’ సిన్మాల రజినీకాంత్ ద్విపాత్రాభినయం సేత్తాండు.సిన్మాను డిసెంబర్ 12న ఇడుదల సేద్దామని ప్లాన్ సేత్తానట్టు తెల్తంది.ఆస్కార్ అవార్డు గెల్సిన ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిండు ఈ సిన్మాకు.నిర్మించింది రాక్ లైన్ వెంకటేష్.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top