అనుకున్నట్టే అయ్యింది లాస్టుకు వచ్చే సర్కి.శ్రీలంక తోటి జర్గుతున్న
వన్డే సీరీస్ను భారత్ 5-0 తో గెల్సి క్లీన్ స్వీప్ చేసింది
సీరీస్ను.శ్రీలంకను క్లీన్ స్వీప్ సేయడం గిది రెండో పారి.1982 ల ఒకపారి
చేసింది కని గప్పుడు 5-0 కాదు.మల్ల గిన్ని ఏండ్లకు శ్రీలంక మీన ఐదుకు ఐదు
గెల్సింది ఇండియా.
శ్రీలంకోల్లు ఇచ్చిన 287 రన్నుల లక్ష్యాన్ని ఇంక 8 బాల్లున్డంగనే ముద్దాడింది భారత్.చేజింగ్ అంటేనే శివాలెత్తే కెప్టెన్ కోహ్లి,గీ మ్యాచ్ ల కూడా అందరౌటుతున్నా నా ఆట నాదే అన్నట్టు క్రీజ్ ల నిలబడి శ్రీలంక బౌలర్లను పొట్టు పొట్టు కొడ్తూ భారత్కు ముచ్చటగా ఐదో విజయాన్ని అందించి ఆస్ట్రేలియా సీరీస్కు రడీగున్నం అని చెప్పిండు.
ముందుగాల టాస్ గెల్సి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంక 6 ఓవర్లల్ల రెండు వికెట్లు పోగొట్టుకొని 45 పర్గులతోని జరంత ఫాస్టుగనే ఆడింది.ఎప్పటాటే అయినట్టు 85 రన్నులకే 4 వికెట్లు పోగొట్టుకొని కష్టాల్ల పడ్డది.గిక్కడ జత కూడిన మాథ్యూస్,తిరిమన్నే శిన్నగ స్కోరు బోర్డును ఉరికిచ్చిరు.గీల్లిద్దరు 45 ఓవర్ల పాటు నిలబడి జట్టు స్కోరు 213 రన్నుల దాంక తీసుకొచ్చినంక తిరిమన్నే 52 రన్నులు చేసి ఔటైండు.250 కూడా సేత్తరో సెయ్యరో అనుకున్నరు అంతా,కాని మాథ్యూస్ కొట్టుడు షురు చేసినంక 300 దాంక స్కోరు పోతదనుకుర్రు.ఏకంగా 10 సిక్సులు కొట్టింది మాథ్యూస్.శివరి ఓవర్ల రెండు వికెట్లు పడ్డయ్,ఇగ దాన్తోని 286 పర్గుల కాన్నే ఆళ్ళ స్కోరు ఆగిపోయింది.మాథ్యూస్ ఐతే పది సిక్సులు,ఆరు ఫోర్లతోని 139 రన్నులు కొట్టి ఔట్ కాకుండ మిగిలిండు.
287 రన్నులు కొట్టనీకి బ్యాటింగ్కు వొచ్చిన ఓపెనర్లు రహనే(2),డబుల్ సెంచరీ హీరో రోహిత్(9)లు తక్కువనే కొట్టి ఔటైర్రు. గప్పుడు భారత్ స్కోరు 14 రన్నులే.రాయుడు,కోహ్లీలు ఇక్కన్నుంచి స్కోరు పెంచే భాద్యత మీదేస్కున్నరు.ముందుగా శిన్నగ ఆడిన గీల్లిద్దరు,తర్వాత కొట్టుడు షురు చేసి ఇద్దరూ అర్థ సెంచరీలు అయిపోగొట్టుకున్నరు.137 రన్నులు జోడిన్చినంక రాయుడు(59) రన్నౌట్ అయిండు.హైదరాబాద్ల జర్గిన వన్డేల ఎట్ల రన్నౌట్ అయిండో గా మాదిరే గీ మ్యాచ్ల రన్నౌట్ అయిండు రాయుడు.
రాయుడు ఔటైనంక వచ్చిన ఊతప్ప(19) కోహ్లీ తోని కల్సి 30 రన్నులు కొట్టినంక ఔటైన్డు.వన్డేల మొదటిపారి ఆడుతున్న కేదార్ జాదవ్ 20 రన్నులు కొట్టి పెవీలియన్ సేరిండు.తర్వాత వొచ్చిన బిన్నీ 12 పర్గులు,ఆ ఎన్కమర్ల వొచ్చిన అశ్విన్ ఫస్టు బంతికే ఔటై పోయిండు.గింత మంది ఔటై పోయిన కోహ్లీ మాత్రం క్రీజ్లనే ఉన్నడు.శ్రీలంకోళ్లకు వికెట్లు పడ్డ సంబరమైతే లేదు,ఎందుకంటే కోహ్లీ క్రీజ్లనే ఉండబట్టే.ఇంగ తర్వాతొచ్చిన అక్షర్ పటేల్ తోని జత కూడిన కోహ్లి సెంచరీ కతం సేసుకుండు.అప్పటికే కొట్టాల్సిన రన్ రేటు మస్తుగుండే,ఇగ గిట్లైతే కుద్రదని దంచుడు షురు సేసిండు.శివరి బంతిని మ్యాచ్ సూడ్నీకి వచ్చినోళ్ళ దగ్గరకు పంపించి గెల్సినం ఇగ నిమ్మలంగ ఇండ్లల్లకు పోర్రి అని సంకేతం ఇచ్చే.
గీ మ్యాచ్ ల విశేషం ఒకటి చెప్పుకోవాలె,అదేందంటే ఇద్దరు కెప్టెన్లు సెంచరీలు సేసిర్రు.అగొ సెంచరీలు సేయడం విశేషం ఏందీ అనుకుంట్టార్ర.ఇద్దరి స్కోర్లు సేరి సమానంగ ఉన్నయ్.మల్ల ఇద్దరు ఔట్ కాకున్టనే ఉన్నరు.
మ్యాన్ అఫ్ ద మ్యాచ్ మాత్రం శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్కు ఇచ్చిర్రు.రెండు వికెట్లు తీసే,అందుకే గీ అవార్డు ఇచ్చిర్రు.ఇగ మన కెప్టెన్ కోహ్లీకి మ్యాన్ అఫ్ ద సీరీస్ ఇచ్చిర్రు.

Post a Comment