0
బీసీసీఐ కి చైర్మన్గ ఉన్డుకుంట ఒక ఐపీల్ టీమ్కు ఓనర్గ ఉండుడు ఏందీ,గిదేం కథ అని సుప్రీంకోర్టు సోమారం శ్రీనివాసన్ను అడ్గింది.దీన్లేక్కన సూత్తే బీసీసీఐ ని ఐపీఎల్ ను వేర్వేరు గ సూల్లెం,ఐపీఎల్ అనేది బీసీసీఐ ల కేలే పుట్టిందా అన్కునేటట్టు ఉంది గిదంత సూత్టంటే అని కోర్టు బాగనే గరమైంది.
బీసీసీఐ ల గిప్పుడున్నోల్లు ఒక టీంను కొనుక్కున్నరు.గిదెట్లుందంటే నేను గల్ల కమాయించుకుంట గిల్ల కమాయించుకుంట అన్నట్లుంది.బీసీసీఐ కి పెద్దగా ఉండి మంచిగ నడిపించాల్సినోడే ఒక టీంకు ఓనర్గా ఉన్డడం ఏందీ,గిది ఏమన్న లెక్కనేనా అని సుప్రీంకోర్టు అన్నది.
IPL-6 ల స్పాట్ ఫిక్సింగ్ యవారంల ముద్గల్ కమిటీ రిపోర్టు పైన సుప్రీంకోర్టు సోంవారం కోపానికి వొచ్చింది.మన దేశంల క్రికెట్ ఆటను మతం లెక్క ఇష్టపడ్తరు.జెంటిల్మెన్ గేమ్గ ఉన్న ఆటను మంచిగ క్రీడా స్పూర్తితో ఆడాల,గంతే కాని ఫిక్సింగ్లు గట్ల సేత్తే క్రికెట్ను బొంద పెట్టినట్టే అని కోర్టు చెప్పింది.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top