ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు ఫిల్ హ్యూగ్స్ తలకాయకు బంతి గట్టిగ తాకడంతోని పరిస్థితి సీరియస్ అయింది.డాక్టర్లు గిప్పుడే ఏం చెప్పలేం అంటున్నరు.
25 ఏండ్ల హ్యూగ్స్ సిడ్నీల అక్కడ ఒక డొమెస్టిక్ మ్యాచ్ అడ్తండు.ఫాస్ట్ బౌలర్ సీన్ అబ్బాట్ బౌలింగ్ చేత్టంటే బాల్ బౌన్సు అయింది.గా దాన్ని ఆడబోయిన హ్యూగ్స్ మిస్ అయిండు,బంతి సక్కగొచ్చి తల్కాయకు తాకింది.తాకంగనే జర్ర సేపు కిందికి సూసిండు.ఫీల్డింగ్ చేత్తున్నోల్లు దగ్గర్కి వత్తనేవున్నరు,లటుక్కున కింద పడ్డడు.కింద పడంగనే సోయి లేకుండ పోయింది.అంతల్నే జట్టు డాక్టరొచ్చి పక్కకు తీస్కపోయి వైద్యం చేసిండు కాని తెల్వి రాలే, అంబులన్స్ ను పిల్సి లేట్ చెయ్యకుండ జల్ది జల్దిన హెలికాప్టర్ దగ్గరకు తీస్కపోయి అల్లనుంచి దగ్గర్ల ఉన్న సెయింట్ విన్సెంట్ దవాఖానల చేర్చిర్రు.పరిస్థితి ఐతే విష్మంగనే ఉంది,గిప్పుడైతే ఏం చెప్పేటట్టు లేదని డాక్టర్లు చెప్పిర్రు.
హ్యూగ్స్ ఇప్పటిదాంక 26 టెస్టులు,25 వన్డేలు,11 టీ20 లు ఆడిండు.తొందర్ల భారత్ తోని జర్గే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు హ్యూగ్స్ ను తీసుకుందాం అనుకుర్రట.దెబ్బ తాకే టైంకి 63 రన్నులతో ఆడ్తండు.గిట్ల అయ్యేసరికి మ్యాచ్నే ఆపేసిర్రు.ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్,భారత్ కెప్టెన్ కోహ్లి ఇంక తక్కినోల్లు శానా మంది క్రికెటర్లు జల్దిగ నయం కావాలే,ఏం కావొద్దని ట్వీట్లు చేసిర్రు.

Post a Comment