బుధవారం మహేశ్వరంలో పెట్టిన భారీ బహిరంగ సభల
తెలుగుదేశంలకేలి బయటికొచ్చి టీఆర్ఎస్ పార్టీల చేరిర్రు గ్రేటర్ హైదరాబాద్
ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్,తీగల కృష్ణారెడ్డి.ఈల్లతోపాటు
ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ కూడా కారేక్కిండు.మహెశ్వరంల ఉన్న టీకేఆర్ కళాశాల
జాగల పెట్టిన సభల సనత్ నగర్ ఎమ్మేల్యే తలసాని,మహేశ్వరం ఎమ్మేల్యే
తీగల,నిజామాబాదుకు చెందిన ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ లకు ముఖ్యమంత్రి కెసిఆర్
గులాబీ కండువాలు కప్పి పార్టీల చేర్చుకుండు.
తెలంగాణాలో కరెంట్ సక్కగుండకపోవడానికి గీ చంద్రబాబు నాయుడే కారణం కాబట్టి,తెలంగాణా ప్రజలు బాగుపడొద్దని చంద్రబాబు కోరుకుంటడు.ఆయన తీరు అస్సలు మంచిగలేదుగనుకనే సైకిల్ దిగినమని తెరాస లో చేరిన నాయకులూ చెప్పిర్రు.
ఇగ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ చంద్రబాబు గురించి మాట్లాడడం దండగ,గాయన గురించి మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవద్దు,హైదరాబాద్ ల ఎక్కడున్న బీదోల్లకు గక్కడే ఇల్లు కట్టిత్తం,మురికివాడలు లేని పట్నంగా హైదరాబాదును సక్కగా తీర్చి దిద్దుతం,ఇస్తాంబుల్ లెక్క హైదరాబాదు పాత బస్తీని మార్చేత్తం,అమెరికా,లండన్ లలో రోడ్లు ఎట్లున్నయో ఇక్కడ కూడా అట్లనే రోడ్లు ఏస్తమని చెప్పిర్రు.

Post a Comment