బుధవారంరోజు కేంద్ర ప్రభుత్వం నల్ల కుబేరుల జాబితాను సుప్రీంకోర్టుకు
అప్పజెప్పింది.విదేశాల్లో అక్రమంగా పైకం దాశి పెట్టుకున్న 672 మంది నల్ల
కుబేర్ల జాబితాను సీల్డు కవర్లో పెట్టి కోర్టుకు ఇచ్చింది కేంద్రం.గీ
సీల్డు కవర్ల మొత్తం మూడు జాబితాలున్నయ్,ఒకదాంట్ల నల్ల పైకం ఉన్నోల్ల
వివరాలు,ఇంకోదాంట్ల విదేశాల్లో ఎవరెవరికి బ్యాంక్ లో ఖాతాలున్నయో ఆళ్ళ
వివరాలు,ఇగ మూడో దాంట్ల దర్యాప్తు ఎందాకోచ్చిందో ఆ వివరాలు.సీల్డు కవర్ను
ఇప్పే అధికారం ఒక్క సిట్ అధ్యక్ష,ఉపాద్యక్షులకే ఉంటదని కోర్టు
చెప్పింది.దర్యాప్తు ఎందకోచ్చిందో నవంబర్ ల ఒకసారి వచ్చి కోర్టుకు
సూపెట్టాలే,అట్లనే మార్చ్ 2015 కల్ల మొత్తం దర్యాప్తే వడగొట్టాలని కోర్టు
సిట్ కు చెప్పింది.
మియం అధికారంకి వచ్చినంక నూరు రోజుల్ల విదేశాల్లో ఉన్న నల్ల పైకాన్ని తీసుకొత్తమని పెద్ద పెద్ద మాటలు చెప్పిన పువ్వు గుర్తోల్లు గిప్పుడు మాట తిప్పి వాళ్ళ సమాచారం బయటపెట్టడం చట్ట విరుద్దమని చెప్పి ఎనిమిదంటే ఎనిమిదే మంది పేర్లను సోమారం సుప్రీంకోర్టుకు ఇచ్చింది అందరికి ఎరుకైన విషయమే.కేంద్రం ఉల్టా పల్టా చేత్తందని తెలుసుకున్న సుప్రీంకోర్టు నాలుగు వాయించింది కేంద్రాన్ని.అక్కడ ఖాతాలు ఉన్నోల్ల లెక్కంతా మాకియ్యాలే,ఆళ్ళ ప్రయోజనాలకోసం మీరేం బాధ పడొద్దు,గా విషయం సిట్ చూసుకుంటదని కోర్టు కొంచం గట్టిగనే కేంద్రాన్ని కడిగింది.అందుకే ఇవ్వాల కేంద్రం ఆల్లదగ్గరున్న జాబితాను సప్పుడు సేయకుండా కోర్టుకు అప్పజెప్పింది.

Post a Comment