0
నవంబర్ 18,19 లలో రెండు రోజులు జర్గే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లె పెళ్ళికి ఫలక్ నుమా ప్యాలెస్కు ఏక్ ధమ్ కలొచ్చిపడ్డది.షాదీకి అన్ని ఏర్పాట్లు ఖతమైనై.మంగళారం మధ్యాహ్నం ముహూర్తం,రేపు ధావాత్ ఉంటది.
గీ పెళ్ళికి 300 మంది దాక అతిథులు వస్తారని తెలుస్తంది.పోలిసుల బందోబస్తు కూడా బాగానే ఉంది.6 నెలలకు ముందే ప్యాలెస్ మొత్తాన్ని బుక్ చేసుకుండు సల్మాన్ ఖాన్.గీ పెళ్ళికి బాలీవుడ్ అంత హైదరాబాద్ల దిగనుంది.పెళ్ళికి మొత్తం హైదరాబాద్ వంటకాలే వండిస్తుర్రట.గది కూడా పారడైస్ హోటల్ అన్ని వంటకాలు తయారు చేస్తున్నట్టు తెలుస్తంది.హైదరాబాద్ బిర్యాని,తలకాయ కూర,హలీంలు ముఖ్యమైన వంటకాలట.
పెళ్లి పిల్ల అర్పిత,పెళ్లి కొడుకు ఆయుష్ లు ఇద్దరూ ముంబైకి చెందినోల్లె ఐనా,హైదరాబాద్ ఫలక్ నుమా(mirror of the sky)లనే సెయ్యాలని డిసైడ్ అయిండు సల్లూ భాయి.ఎల్లకాలం యాద్ ఉండాలని మస్తు ఖర్చు పెడ్తండు సల్మాన్.బద్ద శత్రువు అయిన షారుఖ్ తో పాటు,అమితాబ్,అమీర్ ఖాన్,అంబానీలు,రజినీకాంత్,కమల్ ఇంకా శానా మంది వస్తున్నరు గీ పెళ్ళికి.
సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులకు 60 సంవత్సరాల షష్టిపూర్తి కూడా మంగళారం ప్యాలెస్ ల జరగనుంది.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top