0
తెలంగాణా శాసనసభ రెండోపారి కూడా 10 నిమ్షాలు వాయిదా పడ్డది.పొద్దుగాల 10 కొట్టంగ షురూ ఐన అసెంబ్లీ విపక్షాల లొల్లి మధ్య మొదటిపారి 10 నిమ్షాలు వాయిదా వేసినంక మల్ల రెండోపారి సభ షురూ అయినంక స్పీకర్ విపక్షాల వాయిదా తీర్మానాలను తిరిస్కరించిండు.
సభ రెండోపారి షురూ అయినంక బడ్జెట్ పద్దులమీద మాట్లాడుకుందాం అని స్పీకర్ మధుసూదన చారి చెప్పిండు.అంతల్నే జానా రెడ్డి లేసి మాట్లాడ్తూ ముందుగాల పార్టీ ఫిరాయింపుల మీద చర్చించినంకనే బడ్జెట్ మీద చర్చించాలే,పార్టీ ఫిరాయింపుల సరికాదని,ముఖ్యమంత్రి వైఖరి మంచిగ లేదు అని అన్నడు.గీ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని తక్షణమే తప్పుకోవాలే అని అన్నంక,ఈటెల రాజేందర్ లేసి కొనసాగే అర్హత ఉందో లేదో నువ్వు కాదు సెప్పేది ప్రజలు డిసైడ్ చేస్తరు అని అన్నడు.హరీష్ రావు మాట్లాడ్తూ శాసనసభ యవారాలు సక్కగా జర్గేలా అందరూ సహకరించాలే అని చెప్పినా,విపక్షాల లొల్లి మాత్రం తగ్గలే.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top