0
సినిమా రివ్యూ : కరెంటు తీగ
నటించినోళ్ళు : మంచు మనోజ్,రకుల్ ప్రీత్ సింగ్,జగపతిబాబు,సన్నీ లియోన్,సంపూర్నేష్ బాబు,తాగుబోతు రమేష్,వెన్నెల కిశోర్,సుప్రీత్
దర్శకత్వం : జి నాగేశ్వరరెడ్డి
సంగీతం : అచ్చు
నిర్మాత : మంచు విష్ణు
విడుదల : 31 అక్టోబర్ 2014
తెలుగుల ఇప్పటిదాకా ఏఒక్క సిన్మా కూడా విడుదల కాని ఇదంగా ‘కరెంటు తీగ’ సిన్మా ఏంతక్కువ 31 దేశాల్ల ఇడుదలైంది.గీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంల సిన్మా వచ్చిందంటే ఫెయిల్ ఐతే కాదని అందరికి నమ్మకమే.మరి గా నమ్మకాన్ని నిలబెట్టుకున్నడా లేదా సూద్దాం.
టాకీస్ ల బొమ్మ పడంగనే పార్వతీపురం అనే ఊళ్ళ శివరామరాజు(జగపతిబాబు)ను పోలీసోళ్ళు అరెస్టు చేసుకొని తీసుకుపోతుంటరు.అక్కడ కట్ సేత్తే ఫ్లాష్ బ్యాక్  మొదలైతది.
గీ శివరామరాజు అనేటాయన పార్వతీపురం అనే ఊరికి పెద్ద మనిషి.గీయనకు ముగ్గురు బిడ్డలుంటరు.అల్ల ఒక్క బిడ్డ పేరు కవిత(రకుల్ ప్రీత్ సింగ్),గీమనే సిన్మా హీరొయిన్.శివరామరాజుకు వీర్రాజు(సుప్రీత్)కు అస్సలు పొసగదు.ఒకపాలి శివరామరాజు గీ వీర్రాజుతోని ఒక సవాల్ చేత్తడు.ఏందంటే ఆ సవాలు నా బిడ్డలళ్ళ ఏ బిడ్దన్న ప్రేమించి పెళ్లి సేసుకుంటే ఆల్లను సంపనన్న సంపుత అట్లకాకుంటే నా శెవులన్న కోసుకుంట.గిదిట్లుంటే ఆఊల్లనే రాజు(మనోజ్)అనే పోరగాడు వీఐపీ అనే సంఘాన్ని పెట్టుకొని దానికి రాజే లీడర్.గీ సంఘంతోటి మంచి మంచి పనులు సేసి పెడుతుంటడు రాజు. వాల్లూళ్ళ ఉన్న బల్లె సన్నీ(సన్నీ లియోన్)అనే పంతులమ్మ పాటాలు చెప్తుంటది.ఆ బల్లెనే కవిత సదువుతుంటది.రాజు టీచరమ్మను తెగ ప్రేమిస్తుంటడు.ఈల్లిద్దరి నడుమిట్ల కవితను మధ్యన పెట్టుకుంటడు రాజు. రాజు,సన్నీల మధ్య ప్రేమ ఎందాకెల్లింది?లేకుంటే రాజు,కవిత మధ్య ప్రేమ పుట్టుకొచ్చిందా?అట్లైతే శివరామరాజు ఒప్పుకోని శెవ్వు తీసేసుకుండా మరి ఆల్లను సంపిండా ?గివన్ని తెల్వాల్నంటే టాకీస్కెళ్ళి సిన్మా సూడాల్సిందే.
ఇగో గియ్ మంచిగున్నయ్ :
ఇద్వరకొచ్చిన సిన్మాలల్ల కంటే గీ సిన్మాల మనోజ్ లావైండు.గిది ఊరికి సంబంధించిన సిన్మా కాబట్టి గా పాత్రల మంచిగానే కనిపించిండు.ఇగ నటన కూడా మంచిగనే సేసిండు.జగపతిబాబు ఎట్ల నటిస్తడో అందరికి ఎరుకనే.హీరోయిన్ రకుల్ మస్తు అందంగ కనిపించింది,వుట్టిగ పాటలకోసమో,గ్లామర్ కోసమో కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రంలోనే మంచిగ నటించింది.బూతు హీరోయిన్ ఉన్దేగా,ఆమెనే సన్నీ లియోన్,చేసింది ఫస్ట్ తెల్గు సిన్మా,మంచి ఊపుమీద కన్పించింది సిన్మాల.ఇల్లున్న కామెడీ కళాకార్లు బాగానే నవ్విచ్చిర్రు.క్లైమాక్స్,సినిమాటోగ్రఫీ బాగున్నయ్.
మంచిగ లేనియి గియ్యే :
సిన్మా అన్నప్పుడు అల్ల మంచిగ లేనియి కూడా ఉంటయ్ గా,గావ్వెంతో సూద్దాం.మొద్గాల చెప్పాలంటే సిన్మా సూత్తంటే గీ సిన్మా లెక్క శానా సిన్మాలొచ్చినయ్ అనిపిత్తది.సిన్మా ఇంటర్వెల్ అయ్నంక మస్తు బోర్ కొడ్తది.సిన్మాకు ఎన్కాలోచ్చే మ్యూజిక్ కూడా అంత మంచిగన్పీయదు.హీరో ఉన్నాడు కాబట్టి విలన్తో ఎట్లన్న కొట్టుకునే సీన్ పెట్టాలె అన్నట్టు కొట్టుకునే సీన్లు పెట్టిర్రు.
ఇగ సూడాలే సిన్మా నడ్తదా లేదా అని మనం సెప్పలేమ్ కాని,గీ సిన్మా సూసేటోల్లె డిసైడ్ సేయ్యాలే.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top