0
ప్రపంచంల మస్తు భయంకరమైన దేశాలు ఏమైనా  ఉన్నయంటే గల్ల పాకిస్థాన్ కూడా ఉంటదని శానా మంది అభిప్రాయం.గది అభిప్రాయం కాదు నిజమే అని ఒక అంతర్జాతీయ సంస్థ చెప్పింది.
ప్రపంచంల భయంకరమైన దేశాలల్ల మన పక్క దేశం పాకిస్థాన్ ఎనిమిదో స్థానంల ఉన్నది.గీ విషయాన్ని అమెరికాకు చెందిన intelligence think tank చెప్పింది.
Country Threat Index (CTI) ని మంగళారం IntelCenter ఇడుదల చేసింది.గీ ఇండెక్స్ లెక్కన సూత్తే ముందట ఉన్నది ఇరాక్ దేశం.దీనికి CTI వొళ్ళు ఇచ్చిన స్కోరు 576.దీన్కి ఎన్కాల్నే నైజీరియా,సోమాలియా,యెమెన్,సిరియా,లిబియా,ఈజిప్ట్,కెన్యా.గీ దేశాలు టాప్ 10ల ఉన్నై.గిక్కడ్కి పోవాల్నంటే నిజంగానే ఆలోచించాలే.
మరి ఏలెక్కన గీ దేశాలకు ర్యాంకులు ఇచ్చిరంటే,30 రోజులల్ల గా గా దేశాలల్ల ఏమేం జర్గినయ్ అనేటివి చూసి ర్యాంకు ఇచ్చిర్రు.గిల్ల ముఖ్యంగా టెర్రరిస్టులు ఏమొత్తంల ఉన్నరు,తిరుగుబాటు హెచ్చరికలు,వీడియోలు,ఫోటోలు,కొట్లాటలు,గుద్దుకునుడు,తన్నుకునుడు,ఎంతెంత మంది జీవిపోగొట్టుకున్నరు,ఎంత మందికి దెబ్బలు తాకినై గిట్ల మొత్తం లెక్క కట్టి ర్యాంకు ఇచ్చిర్రు.
మొత్తం మీద 45 దేశాలను సున్నా కంటే ఎక్కువ స్కోరు వొచ్చింది.సగటుల సూత్తే స్కోరు 74 గా ఉన్నది.
ఐతే దేశంల రాజకీయా గ్రూపులు,నేర సంస్థలు,మిలిటరీ బలగాలను మినహాయించిర్రు.
తీవ్రవాదంపై,తిరుగుబాటు హెచ్చరికల మీదనే ఫోకస్ చేసి ఇండెక్స్ రూపొందిన్చిర్రు.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top